బోండా వ్యవహారంపై సీఎం సీరియస్.. వివరణ ఇవ్వాలని ఆదేశం

by Naga Rani Yarlagadda |

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఒకే వేదిక పంచుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన విషయం తెలిసిందే.

బోండా వ్యవహారంపై సీఎం సీరియస్.. వివరణ ఇవ్వాలని ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఒకే వేదిక పంచుకోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో దీనిపై తీవ్రంగా స్పందించారు. అనంతరం దీనిపై బోండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు సంబంధిత టీమ్ ను ఆదేశించారు. ఆ బాధ్యతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడుకు అప్పగించారు. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని గతంలోనే పార్టీ అధిష్ఠానం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ బోండా ఉమా.. అంబటి రాంబాబుతో ఓ కార్యక్రమంలో పాల్గొనడంపై సీఎం బాగా సీరియస్ అయ్యారు. గుంటూరులో జరిగిన ఈ ఘటనపై ఆయన చాలా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story