- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో రసాభాస
by Batti.Sumithra |
కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం సభలో రసాభాస చోటు చేసుకుంది.

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం సభలో రసాభాస చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక జనగామా ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డికి రైల్వే అధికారులు బోకే ఇవ్వలేదని, శాలువతో సత్కరించ లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు జై పల్లా, జై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న బీజేపీ శ్రేణులు తామేమి తక్కువ కాదని భారత్ మాతకు జై అంటూ పెద్దఎత్తున నినాదాలు చేయడంతో సభ ఒక్క సారిగా గందరగోళం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను శాంతింప జేశారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని రైల్వే అధికారులు బోకే, శాలువాతో సత్కరించారు.
Next Story






