అక్రమ కార్యకలాపాల పై ఉక్కుపాదం

by Batti.Sumithra |

కొమరం భీమ్ జిల్లాలోని పెంచికల్‌పేట్ మండలంలో అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్‌ఐ అనిల్ కుమార్ స్పష్టం చేశారు.

అక్రమ కార్యకలాపాల పై ఉక్కుపాదం
X

దిశ, కాగజ్‌నగర్ : కొమరం భీమ్ జిల్లాలోని పెంచికల్‌పేట్ మండలంలో అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్‌ఐ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఎల్లకపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ తనిఖీల్లో అక్రమంగా తయారు చేస్తున్న 850 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 8 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసులు నమోదు చేయగా, సరైన పత్రాలు లేని 10 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. గుడుంబా తయారీ, రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story