- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరీంనగర్ సంచలన చోరీ కేసును చేదించిన పోలీసులు.. కుటుంబ సభ్యులే నిందితులు
కరీంనగర్ లో సంచలనం సృష్టించిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు.

దిశ, బ్యూరో కరీంనగర్ : సంచలనం సృష్టించిన చోరీ కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఈ నేల 22 అర్థరాత్రి కరీంనగర్ భగత్ నగర్‌లోని ఓ ఇంట్లో మాస్కులు దరించి కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేసి చితకబాది 60 తులాల బంగారు ఆభరణాలు 21 లక్షల నగదు ని దోచుకెళ్లిన చోరి ఘటనను ఎట్టకేలకు పోలీసులు చేదించారు. ఈ చోరి ఘటనను సీరియస్ గా పరిగణించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితుల నుంచి పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఆధారాలను సేకరించారు.
అనంతరం అనుమానితులను వాచ్ చేస్తు బాధితులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగారు. దీంతో ఎట్టకేలకు నిందితులను సొంత కుటుంబ సభ్యులుగా గుర్తించినట్టు సమాచారం. అయితే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా అధికారికంగా పోలీసులు ప్రకటించలేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పిఎంజే చోరీ ఘటనలో అనుభవాలను రాష్ట్ర పోలీస్ శాఖ కేస్ స్టడీగా శిక్షణ పోలీసులకు బోదించి అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న కరీంనగర్ పోలీసులు మరో సంచలన కేసును వారం తిరగకముందే చేదించడం పై సర్వత్రా హర్షం వ్యక్తం వ్యక్తం అవుతుంది.






