ఆస్తమా ఉందా? ఈ ఆహారం తీసుకోకపోవడమే మంచిది..!

by Sujitha Rachapalli |

ఆస్తమా అనేది ఊపిరితిత్తులలో వాపు, సంకోచం వల్ల వచ్చే శ్వాస సమస్య. ఆహారం ఆస్తమా లక్షణాలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ (వాపు తగ్గించే), యాంటీఆక్సిడెంట్ నిండిన ఆహారాలు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి.

ఆస్తమా ఉందా? ఈ ఆహారం తీసుకోకపోవడమే మంచిది..!
X

దిశ, ఫీచర్స్ : ఆస్తమా అనేది ఊపిరితిత్తులలో వాపు, సంకోచం వల్ల వచ్చే శ్వాస సమస్య. ఆహారం ఆస్తమా లక్షణాలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ (వాపు తగ్గించే), యాంటీఆక్సిడెంట్ నిండిన ఆహారాలు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. కొన్ని ఆహారాలు వాపు పెంచి లేదా అలర్జీ/గ్యాస్ కలిగించి లక్షణాలను తీవ్రం చేస్తాయి. అందుకే ఆస్తమా ఉన్నవారు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న నిపుణులు.. ఏ ఆహారం తీసుకోవాలి? దేన్ని అవాయిడ్ చేయాలనేది వివరిస్తున్నారు.

తినాల్సిన ఆహారాలు :

* తాజా పండ్లు : ఆపిల్, నారింజ, కివి, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, పప్పాయ, గ్వావా వంటివి తీసుకోవాలి. వీటిలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు (బీటా కెరోటిన్) పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో ఆక్సీడేటివ్ స్ట్రెస్‌ను తగ్గించి.. వాపును నియంత్రిస్తాయి. కాబట్టి రోజూ 2-3 పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

* ఆకుకూరలు, కూరగాయలు : పాలకూర, బ్రోకలీ, క్యారెట్, టమోట, బెల్ పెప్పర్, కాలీఫ్లవర్ వంటివి ఊపిరితిత్తులకు మంచిది. విటమిన్ E, విటమిన్ A, ఫైబర్ నిండి ఉండటంతో.. ఇవి ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే రోజువారీ భోజనంలో చేర్చడం మంచిది.

* ఫ్యాటీ ఫిష్ : సాల్మన్, సార్డైన్స్, మాకరెల్ ఫిష్‌లో ఉండే ఓమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఊపిరితిత్తుల వాపు తగ్గుతుంది. కాబట్టి వారానికి కనీసం 2 సార్లు చేపలు తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

* నట్స్ & సీడ్స్ : బాదం, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్‌లో ఉండే విటమిన్ E కఫ్, వీజింగ్ తగ్గిస్తుంది. రోజుకు గుప్పెడు తీసుకుంటే చాలని చెప్తున్నారు నిపుణులు.

* విటమిన్ D ఫుడ్స్ : గుడ్లు, ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్, ఫ్యాటీ ఫిష్‌లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని చెప్తున్నారు ఎక్స్‌పర్ట్స్. సూర్యరశ్మి కూడా ముఖ్యం. విటమిన్ డి తక్కువ ఉంటే ఆస్తమా అటాక్స్ ఎక్కువవుతాయి.

* మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ : బనానా, ఆకుకూరలు, అవకాడో, హోల్ గ్రెయిన్స్‌లో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ఇవి బ్రాంకియల్ మస్కుల్స్‌ను రిలాక్స్ చేసి శ్వాసను సులభతరం చేస్తాయి. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఓట్స్, బ్రౌన్ రైస్, బార్లీ. ఫైబర్ ఉండటం వల్ల గట్ హెల్త్ మెరుగుపడి.. మొత్తం ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది.

తినకూడని ఆహారాలు :

* డ్రై ఫ్రూట్స్, సల్ఫైట్ ఉన్న ఆహారాలు : డ్రైడ్ ఫ్రూట్స్, వైన్, బీర్, పికిల్డ్ వెజిటబుల్స్, బాటిల్ లెమన్ జ్యూస్, ష్రిమ్ప్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. సల్ఫైట్స్ ఊపిరి మార్గాలను ఇరిటేట్ చేసి అటాక్ తెచ్చే అవకాశం ఉంది.

* గ్యాస్ ఉత్పత్తి చేసే ఫుడ్స్ : బీన్స్, ఉల్లి, వెల్లుల్లి, ఫ్రైడ్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్. గ్యాస్ వల్ల పొట్ట ఉబ్బరం, శ్వాసను కష్టతరం చేస్తాయి.

* ప్రాసెస్డ్, ఫాస్ట్ ఫుడ్ : చిప్స్, బర్గర్, సాసేజ్, బేకన్ వంటివి దూరంగా ఉంచాలి. వీటిలోని ట్రాన్స్ ఫ్యాట్స్, సోడియం, ప్రిజర్వేటివ్స్ వాపును పెంచుతాయి.

* డైరీ ప్రొడక్ట్స్ : డాక్టర్ సలహాను బట్టి పాలు, చీజ్, ఐస్‌క్రీమ్‌ను అవాయిడ్ చేయండి. డైరీ ప్రొడక్ట్స్ వల్ల కఫం పెరిగి శ్వాస మార్గాలు మూసుకుపోవచ్చు. అలర్జీ ఉంటే పూర్తిగా ఆపండి.

Next Story