ECL సీజన్-2 విజేతగా టాలీవుడ్ థండర్స్

by Muthe.Rajitha |

వెండితెర, బుల్లితెర ప్రముఖుల సమ్మేళనంతో కోలాహలంగా జరిగిన 'ఎలైట్ క్రికెట్ లీగ్(ECL) సీజన్-2' రసవత్తరంగా ముగిసింది.

ECL సీజన్-2 విజేతగా టాలీవుడ్ థండర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : వెండితెర, బుల్లితెర ప్రముఖుల సమ్మేళనంతో కోలాహలంగా జరిగిన 'ఎలైట్ క్రికెట్ లీగ్(ECL) సీజన్-2' రసవత్తరంగా ముగిసింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ (ACA-VDCA) అంతర్జాతీయ క్రీడాప్రాంగణంలో ఆదివారం రాత్రి అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాలీవుడ్ థండర్స్ జట్టు 64 పరుగుల భారీ తేడాతో సిరి ఇన్ఫో మిస్సైల్స్ జట్టును చిత్తు చేసి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ ఓటమితో సిరి ఇన్ఫో మిస్సైల్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టాలీవుడ్ థండర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. జట్టులోని బ్యాటర్లు నిఖిల్ సిద్ధార్థ్ (41), అశ్విన్ (40), ఓంకార్ (36), మనీష్ (35) సమష్టిగా రాణించడంతో జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. అనంతరం 197 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన సిరి ఇన్ఫో మిస్సైల్స్ జట్టును టాలీవుడ్ బౌలర్లు కట్టడి చేశారు. త్రినాథ్ (57) అర్ధశతకంతో పోరాడినప్పటికీ, నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే ఆ జట్టు పరిమితమైంది. టాలీవుడ్ థండర్స్ బౌలర్లలో ఖయ్యుమ్ అలీ 3 వికెట్లు, అశ్విన్ బాబు 2 వికెట్లతో రాణించారు.

Next Story