హైదరాబాద్‌లో భారీ వర్షం

by Muthe.Rajitha |

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.

హైదరాబాద్‌లో భారీ వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్‌నగర్, కూకట్‌పల్లి, మెహదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఉదయం నుంచి వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, సాయంత్రం వేళ నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై వాహనదారులు వర్షం వల్ల రాకపోకలకు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

మరో రెండు గంటల పాటు నగరంలోని పలు చోట్ల ఇదే రీతిలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(HMD) వెల్లడించింది. వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హైదరాబాద్ నగరానికి 'ఆరెంజ్ అలర్ట్' (Orange Alert) జారీ చేసింది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వర్షపు నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున జీహెచ్‌ఎంసీ (GHMC) విపత్తు నిర్వహణ దళాలు (DRF) రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

Next Story