- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ అలవాట్లు మీ మెదడును దెబ్బతీస్తాయి.. జాగ్రత్త!
కొన్ని అలవాట్లు మీ మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మెమొరీ, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం, మానసిక స్థితి దెబ్బతినడం, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి రిస్క్ పెరిగే అవకాశముందని చెప్తున్నారు.

దిశ, ఫీచర్స్ : కొన్ని అలవాట్లు మీ మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మెమొరీ, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకోవడం, మానసిక స్థితి దెబ్బతినడం, డిమెన్షియా, అల్జీమర్స్ వంటి రిస్క్ పెరిగే అవకాశముందని చెప్తున్నారు. ఇంతకీ ఈ అలవాట్లు ఏంటి? నివారణ మార్గాలు ఏమిటి? తెలుసుకుందాం.
1. తగినంత నిద్ర లేకపోవడం
మెదడు నిద్రలోనే రిపేర్ అవుతుంది. మెమరీలను ఏర్పరుస్తుంది. టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. రోజూ 7-9 గంటలు నిద్రపోకపోతే ఏకాగ్రత తగ్గుతుంది. మూడ్ స్వింగ్స్ వస్తాయి. నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి స్లీప్ షెడ్యూల్ పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు. రాత్రి ఆల్కహాల్, కాఫీ, టీలు తాగడం.. ఫోన్, ల్యాప్ టాప్ వంటివి చూడటం మానుకోవాలని చెప్తున్నారు.
2. ఎక్కువసేపు కూర్చుని ఉండటం
దీర్ఘకాలం కూర్చుని పని చేయడం వల్ల మెదడుకు రక్తప్రవాహం తగ్గుతుంది. ఇది కాగ్నిటివ్ ఫంక్షన్ తగ్గడానికి దారితీస్తుంది. అందుకే.. గంటకొకసారి లేచి నడవాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రతిరోజూ 30-45 నిమిషాలు వ్యాయామం చేయాలని.. లేదంటే స్పోర్ట్స్ ఆడాలని చెప్తున్నారు.
3. తగినంత నీరు తాగకపోవడం
మన మెదడులో సుమారు 90% నీరు ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల మెదడు సెల్స్ కుంచించుకుపోతాయి. ఏకాగ్రత, మూడ్ దెబ్బతింటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. రోజూ 3-4 లీటర్ల నీరు తాగండి. ఎయిర్ కండిషనర్ గదిలో ఎక్కువసేపు ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి.
4. స్క్రీన్ అడిక్షన్
ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్ చూడటం వల్ల డిజిటల్ ఎగ్జాస్ట్, ఏకాగ్రత తగ్గడం, నిద్ర భంగం కలుగుతుంది. మల్టీటాస్కింగ్ మెదడును అలసిపోయేలా చేస్తుంది. కాబటటి స్క్రీన్ టైమ్ పరిమితం చేయండి. నోటిఫికేషన్లు ఆఫ్ చేయండి.
5. ప్రతికూల ఆలోచనలు
చిన్న విషయాలపై అతిగా రియాక్ట్ అవడం.. ఒత్తిడి పెరగడం వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గి, ధమనులు గట్టిపడతాయి. ఇది డిప్రెషన్, ఆందోళనలకు దారితీస్తుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు రాకుండా ఉండాలంటే.. డీప్ బ్రీతింగ్, మెడిటేషన్, ఇతర పనులపై దృష్టి మార్చండి.
6. అనారోగ్యకరమైన ఆహారం
ఎక్కువ షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటెమ్స్ మెదడులో ఇన్‌ఫ్లమేషన్ పెంచి, రక్త నాళాలను దెబ్బతీస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండమని చెప్తున్నారు నిపుణులు. బెర్రీస్, ఆకు కూరలు, నట్స్, హోల్ గ్రెయిన్స్ తినాలని సూచిస్తున్నారు. షుగర్ డ్రింక్స్ మానుకోవాలని చెప్తున్నారు.
7. హై వాల్యూమ్ మ్యూజిక్
ఎక్కువసేపు హై వాల్యూమ్ హెడ్‌ఫోన్స్ వాడటం వల్ల వినికిడి శక్తి దెబ్బతింటుంది. మెదడు స్పీచ్ సౌండ్స్‌ను గుర్తించడం కష్టమవుతుంది. అందుకని.. వాల్యూమ్ తగ్గించి.. ఇయర్ ప్రొటెక్షన్ వాడాలని చెప్తున్నారు నిపుణులు.
8. సామాజిక ఒంటరితనం
ఒంటరిగా ఉండటం వల్ల స్ట్రెస్, డిప్రెషన్ పెరిగి మెదడు ఫంక్షన్ తగ్గుతుంది. వీలైనంత వరకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపాలి. సోషల్ యాక్టివిటీలు చేయాలి. ఇలా అయితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉంటారని చెప్తున్నారు నిపుణులు.
9. స్మోకింగ్, ఆల్కహాల్ వద్దు
స్మోకింగ్ మెదడు సైజ్ తగ్గిస్తుంది. స్ట్రోక్ రిస్క్ పెంచుతుంది. ఎక్కువ ఆల్కహాల్ న్యూరోటాక్సిన్‌గా పనిచేసి మెమరీ, జడ్జ్‌మెంట్ దెబ్బతీస్తుంది. మద్యపానం, ధూమానం పూర్తిగా మానేస్తేనే బ్రెయిన్ ఆరోగ్యకరంగా ఉంటుంది.






