- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలేఖ్య అందానికి, క్యూట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే.. ఈసారి కొంటె చూపులతో వల విసిరిన బ్యూటీ
లైట్ పింక్ చీరలో మెస్మరైజ్ చేస్తున్న అలేఖ్య హారిక

దిశ, వెబ్ డెస్క్: యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించి, ఆ తర్వాత బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకున్న వారిలో అలేఖ్య హారిక ఒకరు. యూట్యూబ్ వీడియోలతో ప్రేక్షకులకు చేరువైన ఈ బ్యూటీ, బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత తన అభిమానుల సంఖ్యను మరింత పెంచుకుంది.
ఆమెకు వచ్చిన ఆదరణతో హీరోయిన్‌గా అవకాశాలు కూడా తలుపుతట్టాయి. సంతోష్ శోభన్ హీరోగా, అలేఖ్య హారిక హీరోయిన్‌గా ఓ సినిమా ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీంతో ఆమె సినీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరుగుతుందని అభిమానులు భావించారు. అయితే అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
సినిమాల విషయాన్ని పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం అలేఖ్య తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఎప్పటికప్పుడు స్టైలిష్, గ్లామరస్ ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ, తన అందం స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదని నిరూపిస్తోంది. తాజాగా అలేఖ్య తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
లైట్ పింక్ కలర్ చీర, రెడ్ కలర్ బ్లౌజ్‌లో ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపిస్తూనే గ్లామర్ టచ్‌తో ఆకట్టుకుంది. చేతులకు ఎరుపు రంగు గాజులు, మెడలో సింపుల్ నెక్లెస్, నుదుటిపై చిన్న బొట్టు ధరించి, వదులుగా వాలిన కురులతో కెమెరాకు విభిన్న భంగిమల్లో పోజులిచ్చింది.
ఈ ఫోటోషూట్‌లో అలేఖ్య తన అందాలను ఎంతో హుందాగా హైలైట్ చేస్తూ, తన మనోహరమైన చిరునవ్వు, కొంటె చూపులు, స్టైలిష్ లుక్‌తో నెటిజన్లను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






