- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు పై పశువులు.. ప్రమాదాలకు ఆహ్వానం
రెబ్బెన మండల కేంద్రంలోని సీసీ రోడ్డు, కాగజ్‌నగర్‌కు వెళ్లే సర్వీస్ రోడ్డుపై రాత్రి వేళ పశువులు గుంపులుగా పడుకోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దిశ, రెబ్బెన : రెబ్బెన మండల కేంద్రంలోని సీసీ రోడ్డు, కాగజ్‌నగర్‌కు వెళ్లే సర్వీస్ రోడ్డుపై రాత్రి వేళ పశువులు గుంపులుగా పడుకోవడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిని పూర్తిగా ఆక్రమించి పశువులు కూర్చోవడంతో వాహనదారులు ప్రమాద భయంతో ప్రయాణించాల్సి వస్తోంది. అండర్‌పాస్, బ్రిడ్జి కింద కూడా పశువులు ఉండడంతో మలుపులు తిరిగే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ, పోలీసు శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టి రహదారులపై పశువులు సంచరించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
సర్పంచ్ వివరణ..
ఈ విషయమై సర్పంచ్‌ను వివరణ కోరగా, రెండు రోజుల్లోగా పశు యజమానులు తమ పశువులను రోడ్డుపై వదలకుండా ఇంటి వద్దే కట్టి ఉంచాలని సూచించారు. అనంతరం కూడా రహదారులపై పశువులు కనిపిస్తే వాటిని గ్రామ పంచాయతీ బంజరు దొడ్డికి తరలించి, నిబంధనల ప్రకారం పశు యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రహదారులను పశువుల రహితంగా మార్చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు.






