- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి ప్రధాని మోడీ?.. పీఐబీ క్లారిటీ ఇదే!
ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతతో ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా యువతతో ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదొక ఫేక్ న్యూస్ అని, ఇలాంటి వదంతులను నమ్మొద్దని తెలుపుతూ ఆదివారం ‘పీఐబీ ఫ్యాక్ట్ చెక్’ (PIB FactCheck) విభాగం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరణ ఇచ్చింది. ప్రధాని ఎలాంటి ప్రకటన చేయలేదని వెల్లడించింది.
అసలెందుకు ఈ ప్రచారం జరిగిందంటే..?
ఇటీవల నీట్-2026 పేపర్ లీకేజీ వ్యవహారం, లీక్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రధాని మోడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని వీడియోలు చేశారు. అలాగే, యువతకు మరింత చేరువయ్యేందుకు మంత్రులు కూడా ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండాలని ఆయన సూచించారు. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని కొందరు పనిగట్టుకుని ‘సండే ఇన్‌స్టా లైవ్’ అంటూ తప్పుడు పోస్టులు సృష్టించారు. అధికారిక, ధ్రువీకరించిన సమాచారం కోసం ప్రభుత్వ వెబ్‌సైట్‌లను మాత్రమే విశ్వసించాలని పీఐబీ ఈ సందర్భంగా ప్రజలను కోరింది.






