Destination Weddings: డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు భారీ డిమాండ్

by S Gopi |

ఇంటర్నేషనల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు సగటు ఖర్చు రూ.1.5 కోట్లకు పైగానే ఉంది.

Destination Weddings: డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు భారీ డిమాండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో పెళ్లిళ్ల తీరు వేగంగా మారుతోంది. భారీ అతిథుల జాబితా, ఆర్భాట వేడుకల కంటే కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ప్రత్యేక అనుభవాన్ని ఆస్వాదించే 'డెస్టినేషన్ వెడ్డింగ్‌'ల వైపు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. వెడ్‌మీగూడ్ విడుదల చేసిన 'డెస్టినేషన్ వెడ్డింగ్ రిపోర్ట్ 2026' ప్రకారం, ప్రస్తుతం దేశంలోని మొత్తం పెళ్లిళ్లలో దాదాపు నాలుగింట ఒక వంతు డెస్టినేషన్ వెడ్డింగ్‌లే ఉండగా, 2028 నాటికి ఈ వాటా 30-32 శాతానికి చేరే అవకాశం ఉంది. డెస్టినేషన్ వెడ్డింగ్‌ల సగటు బడ్జెట్ కూడా ఏడాదిలో 8 శాతం పెరిగి రూ.58 లక్షలకు చేరుకుంది. ఇంటర్నేషనల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు సగటు ఖర్చు రూ.1.5 కోట్లకు పైగానే ఉంది. ప్రస్తుతం 42 శాతం మంది భారీ వేడుకల కంటే చిన్న కార్యక్రమాలనే ఇష్టపడుతున్నారు. అతిథులకు ప్రత్యేక ఆహారం, వెల్‌నెస్ యాక్టివిటీలు, ఎక్కువ రోజుల వేడుకలు వంటి అంశాలకు ప్రాధాన్యం పెరగడంతో, డెస్టినేషన్ వెడ్డింగ్‌ల సగటు వ్యవధి 2020కి ముందు 1.8 రోజుల నుంచి ఇప్పుడు 3.2 రోజులకు పెరిగింది. రానున్న సంవత్సరాల్లో ఆసియా దేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు డిమాండ్ మరింత పెరిగే అవకాశముందని, వ్యక్తిగత అనుభవాలు, లగ్జరీ ప్రయాణం, ప్రత్యేక వేడుకలకే భారతీయ జంటలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు నివేదిక పేర్కొంది.

Next Story