- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లకుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి..
నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది.

దిశ, సికింద్రాబాద్ : నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఓ గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం ఉదయం సుమారు 11:00 గంటల సమయంలో 35–40 సంవత్సరాల మధ్య వయస్సు గల ఓ గుర్తుతెలియని వ్యక్తి నల్లకుంటలోని ఎస్‌ఎల్ డయాగ్నస్టిక్ సెంటర్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు వెంటనే అంబులెన్స్‌లో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స కోసం చేర్పించారు. అయితే, పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు ఎరుపు రంగు టీ-షర్ట్, నలుపు రంగు షార్ట్ ధరించి ఉన్నాడు. అతని ఎడమ చేతి పై మౌనిక అనే టాటూ ఉంది. మృతుడి వివరాలు ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ గుర్తుతెలియని వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే సమీపంలోని నల్లకుంట పోలీ బీసీస్ స్టేషన్ ను సంప్రదించి వివరాలు తెలియజేయాలని పోలీసులు కోరారు.






