- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేవేందర్ నగర్‌లో రౌడీ మూకలపై చర్యలు తీసుకోవాలి..అఖిలపక్ష నాయకుల డిమాండ్
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో ఇటీవల చోటుచేసుకున్న దాడులు, గొడవలు, ఆస్తుల ధ్వంసం ఘటనలపై అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ,మేడిపల్లి: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో ఇటీవల చోటుచేసుకున్న దాడులు, గొడవలు, ఆస్తుల ధ్వంసం ఘటనలపై అఖిలపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దేవేందర్ నగర్ కాలనీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, జనసేన నాయకులు పాల్గొని బాధితులను, కాలనీవాసులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత నెల గృహప్రవేశం సందర్భంగా ఓ కుటుంబంపై, అలాగే స్థానిక రిపోర్టర్ విష్ణు గౌడ్ ఇంటిపై రాళ్ల దాడి చేసి కారు, బైకులను ధ్వంసం చేసిన ఘటనలో బాధితులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా ఇతరులను అరెస్ట్ చేసి కేసును మళ్లించారని నాయకులు ఆరోపించారు.గొడవలకు ప్రధాన కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జెన్నరాజు, జెన్న నాగరాజు, సానిక ప్రశాంత్, హరీష్‌తో పాటు వారి అనుచరులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాలనీలో యువతను గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి తమ స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని, దీంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రధాన నిందితులను అరెస్ట్ చేసే వరకు అఖిలపక్షం కాలనీవాసులకు అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ను ముట్టడించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాపోలు రాములు, కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ బొమ్మక్ కళ్యాణ్, బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ, కాంగ్రెస్ నాయకులు దానగల్ల యాదగిరి, జక్క రాములు, బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గౌడ్, బీజేపీ నాయకుడు జెనీగ వెంకటేష్, సీపీఐ మండల అధ్యక్షుడు రచ్చ కిషన్, జనసేన నాయకుడు సాయికుమార్, దేవేందర్ నగర్ కాలనీ అధ్యక్షుడు దయ్యాల మహేష్, జనరల్ సెక్రటరీ తాటికాయల యాదగిరితో పాటు కాలనీ కమిటీ సభ్యులు, మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






