చీతా ఫోర్స్ మెరుపుదాడి.. 5 కిలోల గంజాయి స్వాధీనం

by Ratna Kumari |

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబేడ్ చౌరస్తా వద్ద చీతా ఫోర్స్ నిర్వహించిన మెరుపుదాడిలో 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

చీతా ఫోర్స్ మెరుపుదాడి.. 5 కిలోల గంజాయి స్వాధీనం
X

దిశ, బాన్సువాడ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబేడ్ చౌరస్తా వద్ద చీతా ఫోర్స్ నిర్వహించిన మెరుపుదాడిలో 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాడిలో బీహార్‌కు చెందిన బలవంత్ కుమార్ సింగ్, కోటగిరి మండల కేంద్రానికి చెందిన కర్కేలి సంజీవ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు తదుపరి విచారణ నిమిత్తం రుద్రూర్ పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బీహార్ నుంచి గంజాయిని తీసుకువచ్చి స్థానిక రైస్ మిల్లుల్లో పనిచేస్తున్న హమాలీలకు చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story