- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దీరావత్ తండాలో వీఓ భవనం ప్రారంభం
గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.

దిశ, మిర్యాలగూడ రూరల్ : గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలంలోని దీరావత్ తండా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సంస్థ (వీఓ) మహిళా సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా సంఘాల సమావేశాలు, పొదుపు కార్యక్రమాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు గ్రామ సంస్థ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు, మహిళా సంఘాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. మహిళలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం గ్రామ ప్రజలు, మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమైన ఎమ్మెల్యే వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, సంబంధిత శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






