విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దుర్మరణం

by Ratna Kumari |

తల్లాడ మండలంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావి వద్ద మోటారు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువ ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దుర్మరణం
X

దిశ, తల్లాడ : తల్లాడ మండలంలో ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ బావి వద్ద మోటారు మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువ ఎలక్ట్రీషియన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన రాజులపాటి ప్రశాంత్ కుమార్ (29) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం తల్లాడ మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు నర్సాని ప్రసాద్ వ్యవసాయ బావి వద్ద ఉన్న మోటారును మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. మోటారును పరిశీలిస్తూ మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రశాంత్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. పొలం వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రశాంత్‌ను గమనించిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువకుడి ఆకస్మిక మృతితో తాళ్లూరు, వెంకటాపురం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు తల్లాడ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story