మీరాబాయి చాను ప్రదర్శనపై ప్రధాని మోడీ ప్రశంసలు

by Malleboina Mahesh |

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చానుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు.

మీరాబాయి చాను ప్రదర్శనపై ప్రధాని మోడీ ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్‌ 2026లో మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను (Saikhom Mirabai Chanu) స్వర్ణ పతకం సాధించింది. వరుసగా పతకాలు సాధించడంపై ప్రధాని మోడీ (Prime Minister Modi) స్పందిస్తూ.. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. మీరాబాయి విజయం భారతీయ వెయిట్‌లిఫ్టింగ్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయమని ఆయన కొనియాడారు. అంతర్జాతీయ వేదికపై తన అద్భుత ప్రదర్శనతో మరోసారి భారత్ గర్వపడేలా చేసిందని 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు.

వరుసగా రెండు కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు సాధించడమే కాకుండా, తన కెరీర్‌లో మొత్తం నాల్గో CWG పతకాన్ని ఖాతాలో వేసుకున్న మీరాబాయి ప్రతి ఒక్క భారతీయుడికి గొప్ప ప్రేరణ గా నిలుస్తుందని ప్రధాని అన్నారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ, రాబోయే పోటీల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ తన శుభాకాంక్షలు అందజేశారు.

Next Story