బిర్యానీ ప్రియుడికి షాక్.. పొట్లంలో కుళ్లిన లెగ్ పీస్ కలకలం

by Taduka Kalyani |

వరంగల్ నగరంలోని ఖమ్మం రోడ్డులో విక్రయించిన ఓ పొట్లం బిర్యానీలో కుళ్లిన లెగ్ పీస్ బయటపడటంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిర్యానీ ప్రియుడికి షాక్.. పొట్లంలో కుళ్లిన లెగ్ పీస్ కలకలం
X

దిశ, వరంగల్ టౌన్: వరంగల్ నగరంలోని ఖమ్మం రోడ్డులో విక్రయించిన ఓ పొట్లం బిర్యానీలో కుళ్లిన లెగ్ పీస్ బయటపడటంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కావడంతో అధిక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని నాణ్యతను పట్టించుకోకుండా ఇష్టారీతిలో బిర్యానీ తయారు చేసి విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బిర్యానీ కొనుగోలు చేసిన వినియోగదారుడు తినే సమయంలో లెగ్ పీస్ నుంచి దుర్వాసన రావడంతో పరిశీలించగా అది కుళ్లిపోయినట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో సంబంధిత హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని, ఆహార భద్రతా అధికారులు నగరంలోని హోటళ్లు, బిర్యానీ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నాసిరకం ఆహారం విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story