- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రి ఆర్కే రోజాకు పోలీసుల నోటీసులు.. 30న విచారణకు హాజరుకావాలని ఆదేశం
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ఆర్కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత ఆర్కే రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు ఈ నోటీసులు అందజేసిన పోలీసులు.. ఈ నెల 30వ తేదీన విచారణకు హాజరుకావాలని అందులో ఆదేశించారు. మహిళలపై అవాస్తవ కథనాలు రాసిన పత్రిక ప్రతులను దహనం చేస్తూ నిరసన తెలిపినందుకు తనపై కేసు నమోదు చేశారని రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ కేసు బనాయించిందని ఆమె ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఇలాంటి వేధింపులకు పాల్పడుతోందని రోజా మండిపడ్డారు. బెదిరింపులకు, అక్రమ కేసులకు తాను భయపడేది లేదని.. ప్రజల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోందని ఆ పార్టీ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.






