- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన ధర్మపురి పోలీసులు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ ధర్మపురి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు

దిశ, జగిత్యాల టౌన్: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ ధర్మపురి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు. ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు భార్యకు వాట్సాప్‌లో వాయిస్ మెసేజ్ పంపాడు. కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా, విషయం తెలిసిన వెంటనే ధర్మపురి సీఐ రామ్ నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు, ఎస్‌ఐ మహేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. పోలీసులు మొబైల్ లొకేషన్‌ను ట్రాక్ చేయగా, అతను రాయపట్నం గోదావరి ఘాట్ వద్ద ఉన్నట్లు సిగ్నల్ చూపించింది. వెంటనే ఎస్ఐ మహేష్, కానిస్టేబుల్ కిరణ్ అక్కడకు చేరుకుని గోదావరి నది ఒడ్డున ఆత్మహత్యకు యత్నిస్తున్న అతడిని సమయస్ఫూర్తితో సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుల్ కిరణ్‌లను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.






