- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దర్శకుడిగా మరో హీరో.. క్రేజీ అప్డేట్ వైరల్!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు.. నిర్మాతలుగా, డైరెక్టర్లుగా మారుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో టాలీవుడ్ హీరోలు.. నిర్మాతలుగా, డైరెక్టర్లుగా మారుతూ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇప్పటికే రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం తమ తదుపరి సినిమాలకు దర్శకత్వం వహిస్తుండగా.. తాజాగా ఆ లిస్టులో హీరో సుధీర్ బాబు చేరిపోయాడు. నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు, త్వరలో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ మేరకు దర్శకుడిగా మారి ఒక డ్రీమ్ ప్రాజెక్టును తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడట. గత కొంత కాలంగా ఒక విభిన్నమైన కథాంశంపై పని చేస్తున్న ఆయన.. కథ మీద నమ్మకంతో ఆయనే దర్శకత్వం బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. ఆయన స్వీయ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉందని తెలుస్తుండగా.. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాబోతున్నట్లు సమచారం.






