- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ ఢీకొని యువకుడు మృతి
మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వి.టి.పాలెం–జంకు తండా ఎక్స్‌రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

దిశ, మిర్యాలగూడ రూరల్ : మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వి.టి.పాలెం–జంకు తండా ఎక్స్‌రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని బాపూజీనగర్‌కు చెందిన గుడుగుంట్ల విజయ ప్రసాద్ (31) తన స్నేహితులతో కలిసి కొండ అజయ్ నడుపుతున్న మోటార్‌సైకిల్‌పై వి.టి.పాలెంలోని ఎఫ్‌సీఐ గోదాముల వైపు వెళ్తున్నారు. జంకు తండా వైపు వెళ్లేందుకు రోడ్డు దాటే క్రమంలో మోటార్‌సైకిల్ రైడర్ ఎడమ వైపు నుంచి లారీని ఓవర్‌టేక్ చేసి కుడివైపు మలుపు తిప్పినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీని డ్రైవర్ గొల్ల ప్రకాష్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ మోటార్‌సైకిల్‌ను కుడివైపు నుంచి ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గుడుగుంట్ల విజయ ప్రసాద్ తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మోటార్‌సైకిల్ నడుపుతున్న కొండ అజయ్ తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






