రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలి : ఎమ్మెల్యే

by Batti.Sumithra |

రైతులందరికీ గిట్టుబాటు ధర అందేలా చూడాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొన్నారు.

రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలి : ఎమ్మెల్యే
X

దిశ, మంచిర్యాల టౌన్ : రైతులందరికీ గిట్టుబాటు ధర అందేలా చూడాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో నూతన మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా, మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల విశ్వాసాన్ని నిలబెట్టేలా పారదర్శకంగా పనిచేసి మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ.. రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలిచి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన పాలకవర్గానికి సూచించారు.

మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎమ్మెల్యే దంపతులను గజమాలతో, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, మార్కెట్ కమిటీ జిల్లా అధికారులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా ఆర్‌జీపీఆర్ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, ఆత్మ కమిటీ చైర్మన్ సింగితి మురళి, లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు ఒడ్డే రాజమౌళి, జిల్లా నాయకులు నాగభూషణం, మంచిర్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story