'శ్రీనివాస మంగాపురం' ప్రమోషన్స్ జోరు.. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో మూవీ టీమ్ సందడి

by Pulgam srinivas |

'శ్రీనివాస మంగాపురం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జయకృష్ణ ఘట్టమనేని జూలై 27న వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు.

శ్రీనివాస మంగాపురం ప్రమోషన్స్ జోరు.. ఒకే రోజు రెండు ప్రాంతాల్లో మూవీ టీమ్ సందడి
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ ఘట్టమనేని నటించిన 'శ్రీనివాస మంగాపురం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రషా తడానీ కథానాయికగా నటించారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మించగా, ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలో జయకృష్ణ ఘట్టమనేని జూలై 27న వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయాన్ని సందర్శించనున్న ఆయన, అనంతరం ఉదయం 11 గంటలకు వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో అభిమానులు, విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3:30 గంటలకు ఖమ్మంలోని ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని సినిమా విశేషాలను పంచుకోనున్నారు. విడుదలకు ముందే చిత్ర బృందం చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.




Next Story