టాక్సిక్ మంత్ స్టార్ట్ అంటూ వైల్డ్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్

by Chukka Sudharani |

రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కలయికలో వస్తోన్నచిత్రం ‘టాక్సిక్’.

టాక్సిక్ మంత్ స్టార్ట్ అంటూ వైల్డ్ పోస్టర్ షేర్ చేసిన మేకర్స్
X

దిశ‌, సినిమా: రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కలయికలో వస్తోన్నచిత్రం ‘టాక్సిక్’. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇక టాక్సిక్ చిత్రం భారీ అంచనాలు మధ్య ఆగస్టు 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మేకర్స్.. తాజాగా అదిరిపోయే పోస్టర్‌ను వదిలారు. ఈ మేరకు ‘టాక్సిక్ నెల ఘనంగా మొదలవుతోంది.. వేచి ఉండండి’ అంటూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో యశ్.. వైల్డ్ లుక్‌లో కనిపిస్తుండగా.. చేతి నిండా బ్లడ్‌తో దర్శనమిచ్చాడు. ప్రజెంట్ ఈ పోస్టర్ వైరల్ అవుతూ సినిమాలో వైల్డ్ పోర్షన్‌ను ప్రజెంట్ చేస్తుంది.

Next Story