తృటిలో తప్పిన ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన సిమెంట్ లారీ

by Ratna Kumari |

తిరుమలగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ సమీపంలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది.

తృటిలో తప్పిన ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన సిమెంట్ లారీ
X

దిశ, తిరుమలగిరి : తిరుమలగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ సమీపంలో ఆదివారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. జనగామ వైపు నుంచి వస్తున్న సిమెంట్ లారీ యూటర్న్ వద్ద అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో నివాస గృహాలు ఉండటంతో, లారీ డివైడర్‌ను ఢీకొని ఆగకపోయి ఉంటే ఇళ్లలోకి దూసుకెళ్లి భారీ ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

యూటర్న్ వద్ద డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు ఆరోపించారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఓ లారీ డివైడర్‌పై ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను ఢీకొట్టడంతో భారీ నష్టం సంభవించిందని గుర్తు చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు వెంటనే యూటర్న్ వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story