- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామన్వెల్త్ గేమ్స్ 2026: భారత్‌కు స్వర్ణ పతకం సాధించిన మీరాబాయి చాను!
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు 2026లో భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత సైఖోమ్ మీరాబాయి చాను మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత సైఖోమ్ మీరాబాయి చాను (Saikhom Mirabai Chanu) మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడలు 2026 (Commonwealth Games 2026)లో మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆమె పసిడి పతకాన్ని (Gold Medal) కైవసం చేసుకున్నారు. పోటీ ఆరంభం నుంచే తనదైన శైలిలో బరువులను సునాయాసంగా ఎత్తుతూ ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అగ్రస్థానంలో నిలిచి భారత్‌కు బంగారు పతకాన్ని అందించారు. దీంతో భారత్ ఖాతాలో మూడో పతకం వచ్చిం చేరింది. ఈ విజయంతో అంతర్జాతీయ వేదికపై మళ్లీ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మీరాబాయి చానుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా తన విజయ పరంపరను కొనసాగిస్తూ భారత్‌కు గర్వకారణంగా నిలిచిన ఆమెకు రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు, క్రీడాభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.






