అక్రమ మద్యం విక్రయాల పై ఎక్సైజ్ దాడులు

by Batti.Sumithra |

అక్కన్నపేట మండలంలోని కట్కూర్, చాపతండా గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ప్రాంతాల పై ఆదివారం హుస్నాబాద్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.

అక్రమ మద్యం విక్రయాల పై ఎక్సైజ్ దాడులు
X

దిశ, హుస్నాబాద్ : అక్కన్నపేట మండలంలోని కట్కూర్, చాపతండా గ్రామాల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ప్రాంతాల పై ఆదివారం హుస్నాబాద్ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కట్కూర్ గ్రామంలోని పాఠశాల సమీపంలో ఉన్న శ్రీనివాస కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించిన అధికారులు బానోత్ ఉమ వద్ద నుంచి 6 లీటర్ల బీరు, 3.7 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చాపతండాలో నిర్వహించిన తనిఖీల్లో గుగులోతు కొమురయ్య వద్ద 5 లీటర్ల బీరు, 3.6 లీటర్ల మద్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. రెండు ప్రాంతాల్లో కలిపి మొత్తం 11 లీటర్ల బీరు, సుమారు 7.5 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకుని, ఇద్దరి పై కేసులు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ పవన్ వెల్లడించారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై దామోదర్, హెడ్ కానిస్టేబుల్ కొండల్‌రావు, కానిస్టేబుళ్లు సంపత్, శైలజ పాల్గొన్నారు.

Next Story