కూకట్‌పల్లిలో ‘స్పిరిట్’ టీమ్.. ప్రభాస్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్

by Chukka Sudharani |

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’.

కూకట్‌పల్లిలో ‘స్పిరిట్’ టీమ్.. ప్రభాస్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్
X

దిశ, సినిమా : ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్స్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ చిత్రీకరణకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ‘స్పిరిట్ ప్రస్తుతం కూకట్ పల్లిలో షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్‌పై సీన్స్ తీస్తున్నారు సందీప్ రెడ్డి వంగా.. ఇంకో వారం అక్కడే.. ఆల్మోస్ట్ షూట్ అంతా హైదరాబాద్ లోనే!’ అంటూ ఫిలిమ్ వర్గాల నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతుండగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 5న గ్రాండ్ థియేట్రికల్‌కు రాబోతున్నది.

Next Story