ఎర్రచందనం స్మగ్లింగ్.. ఫారెస్ట్ అధికారి సహా ఐదుగురి అరెస్ట్

by Vemula.Srinu Prasad |

తిరుపతి జిల్లాలో అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తనిఖీల్లో సుమారు రూ. 1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు..

ఎర్రచందనం స్మగ్లింగ్.. ఫారెస్ట్ అధికారి సహా ఐదుగురి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లాలో అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తనిఖీల్లో సుమారు రూ. 1.5 కోట్ల విలువైన 78 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనాన్ని సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. అయితే వీరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు ప్రయేయం ఉండటంతో పోలీసు అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇళ్ళ సామగ్రి రవాణా ముసుగులో లోపల ఎర్రచందనం దుంగలను దాచి అత్యంత గోప్యంగా తరలిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. కర్ణాటక, హర్యానా, వెస్ట్ బెంగాల్ తదితర రాష్ట్రాలకు ఎర్రచందనాన్ని విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరి కోసం టాస్క్ ఫోర్స్ బృందాలు గాలిస్తున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story