విద్యార్థులకు సంఘీభావంగా విజయోత్సవ ర్యాలీ

by Batti.Sumithra |

ప్రజాస్వామ్యబద్ధంగా యువత చేస్తున్న ఉద్యమానికి రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి పేర్కొన్నారు.

విద్యార్థులకు సంఘీభావంగా విజయోత్సవ ర్యాలీ
X

దిశ, బడంగ్ పేట్ : ప్రజాస్వామ్యబద్ధంగా యువత చేస్తున్న ఉద్యమానికి రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి పేర్కొన్నారు. బడంగ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బంగారి అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బడంగ్ పేట్ వినాయక మండపం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు నిర్వహిస్తున్న నిరసనను బీజేపీ ప్రభుత్వం అణిచివేయడానికి కుట్ర చేసిందని చల్ల నరసింహారెడ్డి ఆరోపించారు. పోలీసులు విద్యార్థుల పై దాడి చేసినప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా యువత చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలపడం జరిగిందని అన్నారు.

యువత తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని మాజీ మేయర్ చిగురింత పారిజాత అన్నారు. విద్యార్థుల పై జరిగిన దాడిని ప్రశ్నిస్తే ప్రతిపక్ష నాయకుడు అని చూడకుండా రాహుల్ గాంధీ అరెస్టు చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యము చేశారని మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేయాలని చూస్తుందని భారతదేశం యువత ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలరు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, రాళ్ల గూడెం శ్రీనివాస్ రెడ్డి, నూతన అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుభాన్ యాదవ్, ఎస్సీ సెల్ చైర్మన్ కుమార్, కో-ఆర్డినేటర్ వెంకటేష్ గౌడ్, విజయ్, యాతం కుమార్, లక్ష్మి, శెట్టి, మనోహర్, అరుణ జ్యోతి, అమృత నాయుడు, నాగరాజు, భాను ప్రసాద్, రజిని, జీవన్, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story