- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు రోజుల్లోనే ఆ అరుదైన మార్క్‌ను అందుకున్న కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'
'చెన్నై లవ్ స్టోరీ' చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.25.2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటించిన చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ'. ఇందులో శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తాజాగా ఈ మూవీ బృందం విడుదల చేసిన అధికారిక పోస్టర్ ప్రకారం, 'చెన్నై లవ్ స్టోరీ' రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.25.2 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.
రెండు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం విశేషమనే చెప్పాలి. ప్రస్తుతం వీకెండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మరింత మంచి వసూళ్లు వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే ఈ చిత్రం సులభంగానే రూ.50 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చివరికి ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లు సాధించి ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి. ఈ చిత్రానికి సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ఎస్కేఎన్‌తో కలిసి నిర్మాతగా కూడా వ్యవహరించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.






