- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టుదలతో చదివాడు.. ఐదు ఉద్యోగాలు సాధించాడు !
చదువును నమ్ముకున్న వారు ఎన్నటికీ మోసపోరు అని నిరూపించాడు మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన చిందం అంజన్ కుమార్. సామాన్య గ్రామీణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ యువకుడు, పట్టుదలే ఆయుధంగా శ్రమించి ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించాడు.

దిశ, మంచాల : చదువును నమ్ముకున్న వారు ఎన్నటికీ మోసపోరు అని నిరూపించాడు మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన చిందం అంజన్ కుమార్. సామాన్య గ్రామీణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఈ యువకుడు, పట్టుదలే ఆయుధంగా శ్రమించి ఏకంగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించాడు. ఆరుట్ల గ్రామానికి చెందిన చిందం కృష్ణ కుమారుడైన అంజన్ కుమార్, ఉద్యోగ సాధనే లక్ష్యంగా హైదరాబాద్‌లోని పలు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ నిరంతరం శ్రమించాడు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలకు సన్నద్ధమై వరుసగా విజయం సాధించాడు.
ఇటీవల వెలువడిన ఫలితాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGGB) క్లర్క్ తెలంగాణ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ రైల్వే ఎన్టీపీసీ (గ్రాడ్యుయేట్ లెవెల్)రైల్వే ఎన్టీపీసీ (అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్)టిజిఎస్ ఆర్టీసీ (TGSRTC) డిప్యూటీ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఒకేసారి ఐదు రకాల ఉద్యోగాలకు ఎంపికై తన గ్రామానికి, కుటుంబానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అంజన్ కుమార్ విజయం ఎంతో స్పూర్తినిస్తుందని స్థానికులు కొనియాడారు. అత్యంత ప్రతిభ కనబరిచిన అంజన్ కుమార్‌తో పాటు ఆయన తండ్రి కృష్ణను గ్రామస్తులు, స్థానిక నాయకులు, మిత్రులు మర్యాదపూర్వకంగా కలసి అభినందనలు తెలిపారు.






