కూలిన బాలుర ఆశ్రమ పాఠశాల ప్రహరీ గోడ.. పట్టించుకోని అధికారులు

by Taduka Kalyani |

మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలోని ప్రధాన గేటును అనుకుని ఉన్న ప్రహరీ గోడ గత కొద్ది రోజుల క్రితం కూలిపోయింది.

కూలిన బాలుర ఆశ్రమ పాఠశాల ప్రహరీ గోడ.. పట్టించుకోని అధికారులు
X

దిశ,కన్నాయిగూడెం: మండల కేంద్రంలోని బాలుర ఆశ్రమ పాఠశాలలోని ప్రధాన గేటును అనుకుని ఉన్న ప్రహరీ గోడ గత కొద్ది రోజుల క్రితం కూలిపోయింది. సంఘటన జరిగిన సమయంలో విద్యార్థులు ఎవరూ కూడా లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రహరీ కూలి పోవడంతో ప్రధాన గేటు ప్రమాదం అంచున ఉంది. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలని పలువురు డిమాండ్ చేశారు. కూలిన శిథిలాలను శుభ్రం చేయాల్సిన సంబంధిత అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి కూలిపోయిన శిధిలాలను శుభ్రం చేసి ,నూతన ప్రహరీ గోడ నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story