- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్నాపత్రాల లీక్.. ఆ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో.. పంజాబ్ ప్రశ్నాపత్రాల లీకేజీ ఇష్యూ తెరపైకి వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో.. పంజాబ్‌లో చోటుచేసుకున్నాయంటున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ (BJP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ల మధ్య తీవ్ర స్థాయి రాజకీయ యుద్ధం మొదలైంది. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుండగా, తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడా పేపర్ లీకేజీలు జరగలేదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖండించారు.
నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా ఏది?: బీజేపీ ప్రశ్నాస్త్రాలు
బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "నైతికత గురించి మాట్లాడే కేజ్రీవాల్.. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ రాజీనామాను ఎప్పుడు కోరతారు?" అని ప్రశ్నించారు. పంజాబ్‌లో గడిచిన కొద్దికాలంలో పలు కీలక పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని ఆయన ఆరోపించారు. పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (PSEB) 12వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష, పంజాబ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (PSTET), అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ADO) పరీక్ష, పంజాబ్ సబోర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (PSSSB) గ్రూప్-బి, కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అలాగే నైబ్ తహసీల్దార్, ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలలో భారీ ఎత్తున కాపీయింగ్ జరిగిందన్నారు. ఎక్సైజ్ అండ్ ట్యాక్సేషన్ ఇన్స్పెక్షన్ మెరిట్ జాబితాలో నకిలీ పేర్ల నమోదు చేశారని ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ విమర్శలు
ఈ వ్యవహారంలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా కూడా ఆప్‌పై విరుచుకుపడ్డారు. "గత నాలుగేళ్లలో పంజాబ్‌లో 6 ప్రధాన పేపర్ లీకేజీలు జరిగాయి. ఎంతోమంది విద్యార్థుల కలలు కల్లలయ్యాయి. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి జవాబుదారీతనం లేదు. పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ బైన్స్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? పంజాబ్ విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు మరియు జవాబుదారీతనం అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు.






