- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆపరేషన్ ముస్కాన్-12లో 28 మంది బాల కార్మికుల రక్షణ..
ఆపరేషన్ ముస్కాన్-12లో భాగంగా ఆదివారం మేడిపల్లి డివిజన్ పోలీసులు, జిల్లా బాలల సంరక్షణ విభాగం (డీసీపీయూ) సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

దిశ,మేడిపల్లి: ఆపరేషన్ ముస్కాన్-12లో భాగంగా ఆదివారం మేడిపల్లి డివిజన్ పోలీసులు, జిల్లా బాలల సంరక్షణ విభాగం (డీసీపీయూ) సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. డీసీపీయూ మేనేజర్ డా. పి. అరుణ్ జంజాల్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఖలీల్, హెడ్ కానిస్టేబుళ్లు శివలాల్, శేఖర్, లాలూ నాయక్, కానిస్టేబుల్ రాజ్‌కుమార్, మహిళా కానిస్టేబుల్ లక్ష్మితో కలిసి హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను తనిఖీ చేసి 28 మంది బాల కార్మికులను గుర్తించి రక్షించారు.అనంతరం జీఈవీ అసిస్ట్ సివిల్ సర్జన్ డా. బి. విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దని వ్యాపారులకు సూచిస్తూ నో చైల్డ్ లేబర్ బోర్డులను ఏర్పాటు చేయించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.






