శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద తీవ్ర విషాదం.. నలుగురు గల్లంతు

by Malleboina Mahesh |   (  Updated:2026-07-26 12:50:50  IST  )

నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) వద్ద ఆదివారం తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది.

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద తీవ్ర విషాదం.. నలుగురు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project) వద్ద తీవ్ర విషాదం నెలకొంది. సరదా కోసం వెళ్లిన నలుగురు యువకులు నీటిలోకి దిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడే ఉన్న వారు గాలింపు చేపట్టగా ఓ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. అలాగే మరో ముగ్గురి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story