అటు వర్షము లేక ఇటు కరెంట్‌ కోతలతో అన్నదాతల కష్టాలు.

by Taduka Kalyani |

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కరెంట్‌ కోతలతో అన్నదాతలు పరేషాన్‌ అవుతున్నారు.

అటు వర్షము లేక ఇటు కరెంట్‌ కోతలతో అన్నదాతల కష్టాలు.
X

దిశ, గంభీరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో కరెంట్‌ కోతలతో అన్నదాతలు పరేషాన్‌ అవుతున్నారు. అడ్డగోలుగా విద్యుత్‌ సరఫరాలో కోతలు విధిస్తుండడంతో వరి పొలాలు ఎండుతుండడంతో తల్లడిల్లుతున్నారు. 24 గంటల కరెంట్‌ సరఫరా చేస్తున్నామని ఆర్భాటంగా మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నా ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కనీసం ఇటు వైపు చూసిన దాఖలాలు లేవు. ఎడాపెడా విద్యుత్‌ కోతలతో నాటేసిన వరి పొలాలు ఎండుతున్నాయి. నారు మడులకు నీళ్లు అందక దుక్కి సాగడం లేదు. గంభీరావుపేట మండలం లోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయంతో పాటు గృహ అవసరాల కోసం కూడా కరెంట్‌ కోతలు విధిస్తున్నారు. చిన్నపాటి వర్షం పడ్డా, గాలి దుమారానికి సైతం కరెంట్‌ తీసేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. కరెంట్‌ కోతలతో మోటర్లు సైతం కాలుతున్నాయని, వెంటనే వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందించాలని రైతులు కోరుతున్నారు.

కరెంట్‌ లేక పొలం ఎండుతుంది

కరెంట్‌ కోతలతో పొలం ఎండుతుంది. నేను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. నాటు వేసి నాలుగు రోజులైంది. నీళ్లు అందక ఎండుపోతున్నది. అధికారులను అడుగుతే ఏదో మరమ్మతు అని చెబుతారు. గంటగంటకూ కరెంట్‌ తీస్తున్నారు. పొలాలు సరిగా పారడం లేదు. మోటర్లు పోయక దున్నకాలు సాగడం లేదు. కలెక్టర్‌, ఎమ్మెల్యే పట్టించుకొని కరెంట్‌ ఇచ్చి పంటలు కాపాడాలి రైతుల కోరుతున్నారు. రైతు వేసిన రామచంద్రం గంభీరావుపేట బోర్లలో నీరు ఉన్న సరిపడా కరెంటు లేక దుక్కులు ఎండిపోతున్నాయి.

Next Story