దిశ కథనంతో భగీరథ లీకేజీకి శాశ్వత పరిష్కారం

by Ratna Kumari |

మండలంలోని చిట్యాల గ్రామ శివారులో భగీరథ ప్రధాన పైపులైన్ పగిలి వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పారుతున్న ఘటనపై 'దిశ' ప్రచురించిన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు.

దిశ కథనంతో భగీరథ లీకేజీకి శాశ్వత పరిష్కారం
X

దిశ, తాడ్వాయి : మండలంలోని చిట్యాల గ్రామ శివారులో భగీరథ ప్రధాన పైపులైన్ పగిలి వేలాది లీటర్ల తాగునీరు వృథాగా పారుతున్న ఘటనపై 'దిశ' ప్రచురించిన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి లీకేజీకి శాశ్వత పరిష్కారం చూపించారు. జూలై 25న 'దిశ' వెబ్ లో, అనంతరం ఆదివారం దిశ దినపత్రికలో "భగీరథ పైపులైన్ లీకేజీ.. వృథాగా పోతున్న నీరు"** అనే శీర్షికతో ప్రచురితమైన కథనం అధికారుల దృష్టికి చేరింది. దీంతో భగీరథ అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చిట్యాల శివారులో పగిలిన ప్రధాన పైపులైన్‌కు శాశ్వత మరమ్మతులు పూర్తి చేయడంతో తాగునీటి లీకేజీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో వేలాది లీటర్ల విలువైన తాగునీరు వృథా కాకుండా కాపాడగలిగారు. సమస్యపై వెంటనే స్పందించి శాశ్వత చర్యలు చేపట్టిన భగీరథ అధికారులను, అలాగే సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారానికి దోహదపడిన దిశ పత్రికను గ్రామస్తులు, రైతులు, వాహనదారులు అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story