- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఆకాశంలో ఒక తార' నుంచి 'చిట్టి చిట్టి చీమ' సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
'ఆకాశంలో ఒక తార' చిత్రంలోని 'చిట్టి చిట్టి చీమ' పాటను జూలై 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఆకాశంలో ఒక తార'. పవన్ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ బృందం అభిమానులకు ఓ క్రేజీ అప్‌డేట్‌ను అందించింది. ఈ చిత్రంలోని 'చిట్టి చిట్టి చీమ' అంటూ సాగే పాటను జూలై 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం నిర్మిస్తుండగా, గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై రూపొందుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించనప్పటికీ, తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు.






