టీజీ పీజీఈసెట్ మొదటి విడతలో 4221 సీట్ల కేటాయింపు

by Malleboina Mahesh |

టీజీ పీజీఈసెట్-2026 మొదటి విడతలో 4221 మంది అభ్యర్థులు సీట్లు పొందారు.

టీజీ పీజీఈసెట్ మొదటి విడతలో 4221 సీట్ల కేటాయింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎంఈ, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పీజీఈసెట్-2026 మొదటి విడతలో 4221 మంది అభ్యర్థులు సీట్లు పొందారు. టీజీ సెట్స్(ఇతర) అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగా రెడ్డి ఒక ప్రకటనలో సీట్ల వివరాలను వెల్లడించారు. కన్వీనర్ కోటాలో మొత్తం 5,338 సీట్లు ఉంటే, 4,221 మందికి సీట్లు లభించాయి. 7750 మంది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. సీటు పొందిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజు రసీదు, జాయినింగ్ రిపోర్ట్‌తో జూలై 27 నుండి 30 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయాలని కన్వీనర్ తెలిపారు. కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాతే ప్రొవిజనల్ అలకేషన్ ఆర్డర్ అందజేస్తారు.

Next Story