- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెన్‌జీలకు మంత్రి పదవి ఇవ్వండి: బండి సంజయ్
తెలంగాణలో జెన్‌జీలకు మంత్రి పదవి ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. మాటలు చెప్పడం కాదు, ఆచరణలో చూపాలన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జెన్‌జీలకు మంత్రి పదవి ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. మాటలు చెప్పడం కాదు, ఆచరణలో చూపాలన్నారు. బండి సంజయ్ ఆదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. 'చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి జెన్‌జీలకు పదవులు ఇవ్వండి. మీ వద్ద హోమ్, విద్యా, మున్సిపల్ శాఖలు ఖాళీగానే ఉన్నాయి కదా. జెన్‌జీలకు ఆ శాఖలు అప్పగించండి. మీ దృష్టిలో జెన్‌జీలంటే వీహెచ్, కేకే, కోదండ రెడ్డి. వృద్ధులకు, వయసు దాటిన పెద్దలకు యూత్ కోటాలో పదవులు ఇవ్వడం కాంగ్రెస్‌కు అలవాటే కదా. బీజేపీకి దేశం ఫస్ట్, పార్టీ నెక్ట్స్, పర్సన్ లాస్ట్. ఆ కోణంలోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు' అని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Next Story






