- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సదాశివపేటలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కేంద్రం ప్రారంభం
శిశిర హాస్పిటల్ వారి సహకారంతో సదాశివపేట పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్‌ను ఆదివారం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు.

దిశ, సదాశివపేట : శిశిర హాస్పిటల్ వారి సహకారంతో సదాశివపేట పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టింగ్ సెంటర్‌ను ఆదివారం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఆయన సౌజన్యంతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా డాక్టర్ సింధు మాధవనేని ఆధ్వర్యంలో మహిళలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సూచనలు, అవగాహన కల్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సేవలను వినియోగించుకున్నారు.
అనంతరం ఎంపీ రఘునందన్ రావు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి అక్కడి సౌకర్యాల పై వైద్యాధికారులతో మాట్లాడారు. ఆరోగ్య కేంద్రానికి అవసరమైన వంటశాల (కిచెన్), గోదాముల నిర్మాణాన్ని ఎంపీ నిధుల ద్వారా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కేంద్రంలో వైద్యుల వివరాలు, విధుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరు సంగమేశ్వర్, పట్టణ మాజీ అధ్యక్షుడు కే. శ్రీనివాస్, పట్టణ అధ్యక్షురాలు ఓదెల రాజేశ్వరి, మండల అధ్యక్షులు కర్ణ ఆదిత్య, పలువురు నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






