- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: అభిజీత్ దిప్కే
త్వరలోనే కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భవిష్యత్ వ్యూహాలు, కార్యాచరణను వెల్లడిస్తామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ (CJP) భవిష్యత్ వ్యూహాలపై అందరి దృష్టి పడింది. ఈ క్రమంలో తమ భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Deepke) తెలిపారు. నిన్నటితో కీలక ఘట్టం ముగిసిందని, తమకు కొంత సమయం ఇవ్వాలని ఆయన మీడియాను కోరారు. పంజాబ్‌లో జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న పేపర్ లీకేజీ అంశంపై స్పందిస్తూ.. ఈ విషయంపై కూడా తాము త్వరలోనే ప్రణాళిక సిద్ధం చేసి మాట్లాడతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వంతో జరుగుతున్న చర్చల గురించి ఆయన మాట్లాడుతూ.. ఆందోళనల సమయంలో నమోదైన కేసులకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని వెల్లడించారు. నిరసనల్లో పాల్గొన్న ఏ విద్యార్థిపైనా ఎలాంటి కేసులు నమోదు చేయకూడదనేది తమ ప్రధాన డిమాండ్ అని అభిజీత్ దిప్కే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతకు ముందు ఎంపీ, సీనియర్ న్యాయవాది అయిన కపిల్ సిబల్‌ను కలిసిన తర్వాత మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.






