​హుజురాబాద్‌లో ఘనంగా ఛత్రపతి సాహు మహారాజ్ 152వ జయంతి ఉత్సవాలు...

by Taduka Kalyani |

హుజురాబాద్ పట్టణంలోని స్థానిక టి.డబ్ల్యూ.జే.ఎఫ్ కార్యాలయంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహారాజ్ 152వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

​హుజురాబాద్‌లో ఘనంగా ఛత్రపతి సాహు మహారాజ్ 152వ జయంతి ఉత్సవాలు...
X

దిశ,​హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలోని స్థానిక టి.డబ్ల్యూ.జే.ఎఫ్ కార్యాలయంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఛత్రపతి సాహు మహారాజ్ 152వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొని సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

​బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన మహనీయుడు..

​ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ.. సాహు మహారాజ్ జయంతిని నిర్వహించడం అభినందనీయమన్నారు. ​"ఈనాడు బడుగు, బలహీన వర్గాలు అనుభవిస్తున్న రిజర్వేషన్లకు ఆనాడే పునాది పడింది. 1902లోనే సాహు మహారాజ్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే, తదనంతర కాలంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్లను పొందుపరచడానికి ప్రేరణగా నిలిచాయి," అని ఆయన పేర్కొన్నారు. విద్య, కుల వివక్ష నిర్మూలన, మహిళా సాధికారత కోసం సాహు మహారాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమని, బడుగు బలహీన వర్గాల ప్రజలంతా ఆయన ఆశయాలను నిరంతరం స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాజ్యాంగ బద్ధంగా లభించాల్సిన రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసి, బీసీల అభ్యున్నతికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు.​ ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు ​చిలుకమారి శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, మున్సిపల్ కౌన్సిలర్ ఇల్లందుల సమ్మయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ తడికమళ్ళ శేఖర్, ​బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ మహిళా ప్రధాన కార్యదర్శి దేవసాని ప్రియదర్శిని, ​బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గజ్వేల్ మధుసూదన్, ​అంబేద్కర్ కమిటీ అధ్యక్షుడు ఆడెపు సురేందర్, ​కొలిపాక క్రాంతి, మల్లేశం, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Next Story