- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శాకంబరీ అలంకరణలో దివ్య దర్శనమిచ్చిన శ్రీ మాతా నిమిషాంబికా దేవి..
by Taduka Kalyani |
ఆషాఢ మాసం సందర్భంగా బొడుప్పల్‌లోని శ్రీ మాతా నిమిషాంబికా దేవి ఆలయంలో అమ్మవారిని శాకాంబరీ దేవిగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పండ్లతో అత్యంత వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

X
దిశ,మేడిపల్లి: ఆషాఢ మాసం సందర్భంగా బొడుప్పల్‌లోని శ్రీ మాతా నిమిషాంబికా దేవి ఆలయంలో అమ్మవారిని శాకాంబరీ దేవిగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పండ్లతో అత్యంత వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య అలంకరణను దర్శించేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు, క్యూలైన్లు, ప్రసాద వితరణతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్, ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ, ఉమాకాంత్ శర్మతో పాటు ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story






