- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏర్పేడు సీఐ తీరుపై స్వామీజీల ఆగ్రహం.. శ్రీనివాసమంగాపురంలో సమావేశం
తిరుపతి జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమంలో పీఠాధిపతి పరిపూర్ణానందగిరి, స్వామీజీల మధ్య వివాదం నెలకొంది. ఆశ్రమానికి సంబంధం లేని వ్యక్తులు చొరబడటం, వందల కోట్ల విలువైన ఆస్తులు అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలతో మఠంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ..

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమంలో పీఠాధిపతి పరిపూర్ణానందగిరి, స్వామీజీల మధ్య వివాదం నెలకొంది. ఆశ్రమానికి సంబంధం లేని వ్యక్తులు చొరబడటం, వందల కోట్ల విలువైన ఆస్తులు అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలతో మఠంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాసాశ్రమం పీఠాధిపతి పరిపూర్ణానందగిరితో స్వామీజీలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. 1000 మందికిపైగా మలయాళ స్వామి ఆశ్రమానికి సంబంధించిన భక్తులతో పాటు పీఠాధిపతులు, స్వామీజీలు మూడు ప్రధాన డిమాండ్లను పరిపూర్ణానందగిరి ఎదుట ప్రతిపాదించారు. పీఠాధిపతిగా పరిపూర్ణానందగిరి స్వామి కొనసాగుతూనే ఆశ్రమ అధికారిగా కొనసాగుతున్న అమర్‌నాథ్ రెడ్డిని, ఆశ్రమంపై పెత్తనం చెలాయిస్తున్న పీఠాధిపతి సోదరుడు సోదరుడు శివరాంను తొలగించాలని, 21 మందితో కమిటీ వేయాలని స్వామీజీలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ చర్చల సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వామీజీలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా శ్రీనివాసమంగాపురంలో సమావేశం నిర్వహించారు. వ్యాసాశ్రమం పరిరక్షణ సమితి, పూర్వ విద్యార్థులతో లలితాపీఠంలో స్వస్వరూపానంద సమావేశమయ్యారు. స్థానిక సీఐ తీరు అభ్యంతరకరంగా ఉందని తెలిపారు. ఆశ్రమం వెనుక పోలీస్ శక్తి ఉందని స్వామిజీలు ఆరోపించారు.






