- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'వికసిత్ విలేజ్' నివేదికలపై ఆరా తీసిన ప్రధాని మోడీ
'వికసిత్ విలేజ్' ప్రోగ్రామ్ 2026 భాగస్వాములతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ (Video conferencing) ద్వారా వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం 2026 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'వికసిత్ విలేజ్' నివేదికలపై ప్రధాని మోడీ ఆరా తీశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 245 కంటే ఎక్కువ జిల్లాల నుంచి 5,000 మందికి పైగా వాలంటీర్లు ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో వర్చువల్‌గా కనెక్ట్ అయ్యారు. సరిహద్దు గ్రామాల అభివృద్ధి, యువత భాగస్వామ్యం, స్థానిక ప్రాంతాల్లో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల పురోగతిని ప్రధాని ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ కి చెందిన 'మై భారత్' (MY Bharat) వాలంటీర్ దివ్యాంశు జోషి తన అనుభవాలను పంచుకున్నారు. మై భారత్ అందించిన ఈ గొప్ప అవకాశం వల్ల సాధారణ యువకుడైన తాను దేశ సరిహద్దు గ్రామాలను సందర్శించగలిగానని హర్షం వ్యక్తం చేశారు. మై భారత్ ప్లాట్‌ఫారమ్ ద్వారా దేశవ్యాప్తంగా 2.3 కోట్లకు పైగా యువతకు తమ ప్రతిభను చాటుకునే సరైన వేదిక లభించిందని, 'నేషన్ ఫస్ట్' (దేశమే ప్రథమం) స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ప్రధానికి యువకులు వివరించారు.






