కళ్యాణకట్టల్లో భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు

by Taduka Kalyani |

వేములవాడ దేవస్థానంలోని కళ్యాణకట్టల్లో భక్తుల నుంచి నగదు వసూళ్లకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎల్. రమాదేవి ఘాటుగా స్పందించారు.

కళ్యాణకట్టల్లో భక్తుల నుంచి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు
X

దిశ, వేములవాడ : పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని కళ్యాణకట్టల్లో భక్తుల నుంచి నగదు వసూళ్లకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈ.ఓ) ఎల్. రమాదేవి ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో కళ్యాణకట్టల్లో విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులను ఈ.ఓ రమాదేవి ఆదివారం తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఇలాంటి వీడియోలు వైరల్ కావడం వల్ల ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని, భక్తుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు డిమాండ్ చేయరాదని నాయీ బ్రాహ్మణులకు సూచించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆలయ అసిస్టెంట్ ఈ.ఓలు జయకుమారి, నాగుల మహేష్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story